News May 7, 2025
BHPL: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.
Similar News
News March 28, 2026
ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.
News March 28, 2026
SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్‌కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్‌గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్‌లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.
News March 28, 2026
(UPDATE) విశాఖ: ఇండిగో విమానానికి తప్పిన పెనుప్రమాదం

విశాఖ నుంచి వెళ్తున్న <<19498361>>ఇండిగో<<>> 6E-579 విమానం ఇంజిన్ లోపంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బోయింగ్ 737 విమానంలో 161 మంది ప్రయాణికులు ఉండగా, వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఉదయం 10:54 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. సాంకేతిక లోపం గుర్తించిన పైలట్లు ప్రాధాన్యత ల్యాండింగ్ కోరగా విమానం సురక్షితంగా దిగింది.


