News May 7, 2025
చెపాక్‌లో చెన్నై చెత్త రికార్డు

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSK ఓటముల పరంపర కొనసాగిస్తోంది. ఆఖరికి హోంగ్రౌండు చెపాక్‌లోనూ అదృష్టం కలిసిరావట్లేదు. IPL హిస్టరీలో తొలిసారి ఆ జట్టు వరుసగా నాలుగు హోం మ్యాచ్‌లలో ఓడింది. మార్చి 28న RCB, ఏప్రిల్ 5న డీసీ, 11న కేకేఆర్, నిన్న SRH చేతిలో పరాజయం పాలైంది. 2008, 2012లోనూ నాలుగు మ్యాచ్‌లు ఓడినప్పటికీ వరసగా కాదు. ఇక చెపాక్‌లో SRHకు ఇదే తొలి విజయం. గతంలో అక్కడ వరుసగా 5 మ్యాచ్‌లు ఓడింది.
Similar News
News March 22, 2026
యుద్ధంతో అమెరికాకు ₹2.5లక్షల కోట్ల ఖర్చు

ఇరాన్‌పై యుద్ధంలో తగ్గేదే లేదని గాంభీర్యం ప్రదర్శిస్తున్న అమెరికాకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఈ యుద్ధం కోసం 21 రోజుల్లో $27 బిలియన్లు (₹2.5లక్షల కోట్లు) ఖర్చు చేసింది. పైగా మరో $200 బిలియన్లకు ట్రంప్ పార్లమెంటులో రిక్వెస్ట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే USకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికే US అప్పు 39 ట్రిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.
News March 22, 2026
ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్

TG: రైతుభరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి వివరాలకు AEOలను సంప్రదించాలి.
News March 22, 2026
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాక్ టాప్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.


