News May 7, 2025
ఇరగవరం: సొసైటీ కార్యదర్శి మృతిపై అనుమానాలు!

ఇరగవరం(M) కొత్తపాడు సొసైటీ కార్యదర్శి చల్లా సాయిబాబా మృతి ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. అవి వెలుగులోకి వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.
Similar News
News March 5, 2026
భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.
News March 5, 2026
ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
9న భీమవరం వస్తున్న షర్మిల!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.


