News May 7, 2025
పార్వతీపురం చేరుకున్న ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్

ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్ శనివారం పార్వతీపురం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు డీఆర్ఓ హేమలత పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ఆయన పలు శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Similar News
News March 18, 2026
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్‌ను టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.
News March 18, 2026
నంద్యాలలో ఈనెల 24న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MNV రాజు తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇక్కడ ప్రతిభచాటిన క్రీడాకారులు ఈనెల 30, 31వ తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
News March 18, 2026
HYD: ‘అగ్నివీర్’లో దరఖాస్తుల ఆహ్వానం

అగ్నివీర్ నియామకాలకు అర్హులైన యువత <


