News May 7, 2025
పెదవేగి: పెళ్లి రోజే వివాహిత మృతి

పెదవేగి మండలం దిబ్బగూడెంలో విషాద ఘటన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. దిబ్బగూడెంకు చెందిన బాల సురేశ్, మీనాక్షి (21)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర పాప సంతానంగా ఉంది. అయితే మీనాక్షి అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందింది. సురేశ్- మీనాక్షి దంపతుల పెళ్లిరోజు కూడా శుక్రవారమే. అటు అత్తమామలపై మీనాక్షి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
యుద్ధ ప్రభావం: నంద్యాల జిల్లాలో కుప్పకూలిన ధరలు

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు నంద్యాల జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. క్వింటాల్ పసుపు రూ.13 వేల నుంచి రూ.9 వేలకు, మొక్కజొన్న రూ.2500 నుంచి రూ.1400కు తగ్గింది. అరటి, నిమ్మ ధరలు సైతం సగానికి పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
News March 17, 2026
డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
News March 17, 2026
NGKL: మండిపోతున్న ఎండలు.. వెల్టూరులో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఉప్పునుంతల మండలం వెల్టూర్‌లో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తాడూర్ మండలం యంగంపల్లిలో 38.4°C, వంగూర్ మండలం కిష్టంపల్లిలో 38.3°C, అచ్చంపేట మండలం ఐనోల్‌లో 38.2°C, పెద్దకొత్తపల్లి 37.9°C, వెల్దండ మండలం బెల్లంపల్లిలో 37.7°C, కల్వకుర్తిలో 37.5°C, తిమ్మాజిపేట, ఊర్కొండ 37.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


