News May 7, 2025

నారాయణపేట: అడిషనల్ కలెక్టర్‌కు డీడబ్ల్యూవో బాధ్యతలు

image

శిశుసంక్షేమ శాఖకు చెందిన ఓ జిల్లా అధికారిని అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించి, ఇది వరకు (డీడబ్ల్యూఓగా) కొనసాగిన జయబాయిని పోస్ట్ నుంచి తప్పించింది. నారాయణపేట జిల్లాకు ఈ మధ్యనే అడిషనల్ కలెక్టర్‌గా వచ్చిన సంచిత్ గంగ్వార్‌కు నారాయణపేట జిల్లా డీడబ్ల్యూఓ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఇచ్చారు.

Similar News

News March 19, 2026

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఖరారు

image

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.

News March 19, 2026

MLAగా నారా రోహిత్ పోటీ..?

image

చంద్రగిరి(M) నారావారిపల్లెలో హీరో రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇది వరకు చంద్రగిరి MLAగా గెలిచారు. ఇప్పుడు అక్కడ పులివర్తి నాని సిట్టింగ్ MLAగా ఉన్నారు. ఒకవేళ రోహిత్ ఎన్నికల్లో పోటీచేస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తారా లేక మరోదైనా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.

News March 19, 2026

సాదాబైనామాలపై రైతులకు సీఎం శుభవార్త..!

image

ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా భూసమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం తాజా ప్రకటనతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా పట్టాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి