News May 7, 2025
‘భారత్ సమ్మిట్’లో ఉగ్రదాడిని ఖండించిన మక్తల్ ఎమ్మెల్యే

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ‘భారత్ సమ్మిట్’లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదన్నారు. ఈ మేరకు ఆయన సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 21, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు!

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?
News March 21, 2026
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ.25 కోట్లే!

Dy.CM భట్టి బడ్జెట్ ప్రసంగంలో MGUలో నూతనంగా LAW, ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపుల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించింది. ఈ బడ్జెట్‌లో వర్సిటీకి కేవలం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. ఈ అరకొర నిధులతో కొత్త కాలేజీలు ఎలా వస్తాయని, వర్సిటీ అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగులుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 21, 2026
ప్రీమియం పెట్రోల్ ధరల పెంపు.. కృష్ణా జిల్లాపై కోట్ల భారం

కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్‌పై రూ. 2.30 పెంపు చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. జిల్లాలోని 350 బంకుల్లో రోజుకు 10.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగంలో సుమారు 10 శాతం ప్రీమియం వాటా ఉంది. ధర పెంపుతో రోజుకు రూ. 2.41 లక్షలు, నెలకు రూ. 72.45 లక్షలు, ఏడాదికి రూ. 8.69 కోట్ల భారం పడనుంది. దీంతో వినియోగం తగ్గే అవకాశముందని బంకుల యజమానులు చెబుతున్నారు.


