News May 7, 2025

ఉయ్యూరులో ఈనెల 30న జాబ్ మేళా

image

ఈనెల 30న ఉయ్యూరు AG&SG సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు నైపుణ్య అభివృద్ధి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజ్యూమ్, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.

Similar News

News March 10, 2026

చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

image

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.

News March 9, 2026

EVM గోడౌన్‌ను తనిఖీ చేసిన కృష్ణా కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీలు తీయించారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.