News May 7, 2025
MBNR: ‘పెండింగ్ స్కాలర్ షిప్‌లు విడుదల చేయండి’

చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్‌షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్‌షిప్‌ను చెల్లించాలని కోరుతున్నారు.
Similar News
News March 19, 2026
‘అమరావతి నిర్మాణానికి మెటీరియల్ నిరంతర సరఫరా జరగాలి’

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి మైన్స్, CRDA, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే సుమారు రూ.11 లక్షల టన్నుల మెటీరియల్ సరఫరాకు అనుమతులు మంజూరు చేశామని, కొత్త క్వారీ లీజుల ప్రక్రియ జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
News March 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 19, 2026
ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.


