News May 7, 2025

వనపర్తి: 27న శ్రీ అభయాంజనేయ స్వామి హోమం 

image

వనపర్తి పట్టణంలోని శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో ఈనెల 27న శ్రీ అభయాంజనేయ స్వామి హోమం, భక్తులచే ఉత్సవ మూర్తికి అభిషేకం నిర్వహిస్తామని, అభిషేకం అనంతరం హారతి, తీర్థ ప్రసాదాలు అందజేస్తామని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. మ.1 గంటకు దాతలు డా.శారద, నాగరాజు, అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు వారు చెప్పారు.

Similar News

News March 25, 2026

మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

image

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2026

పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

image

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.