News May 7, 2025
రాయచోటి: బస్సు, బొలెరో ఢీ.. ఒకరి మృతి

అన్నమయ్య జిల్లా బండపల్లి టోల్గేట్ వద్ద బస్సు, బొలెరోను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో <<16220248>>20 మంది గాయపడ్డారు<<>>. స్థానికుల వివరాల ప్రకారం.. బొలెరో వాహనం టైర్ పగలడంతో డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేశాడు. దానిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిలో ఒకరైన రామంజనేయ రెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స ఆయన పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 27, 2026
ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?
News March 27, 2026
విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తాం: నారా భువనేశ్వరి

త్వరలోనే విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం (చిత్తూరు)లో పర్యటించిన ఆమె దీనిపై ప్రకటన విడుదల చేశారు. విజయవాడతో పాటు అనంతపురంలో ప్రారంభించే తలసేమియా సెంటర్ నిర్వహణ బాధ్యతను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చూసుకుంటుందన్నారు. విజయవాడలో తలసేమియా సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు.
News March 27, 2026
VJA: ఉగ్రవాద కేసులో కీలక మలుపు!

ఉగ్రవాద కార్యకలాపాల కేసు దర్యాప్తులో కొత్తపేట పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు CI కొండలరావు తెలిపారు. పట్టుబడిన వారిలో లక్కీ అహ్మద్, అజ్ముల్లా ఖాన్, అబ్దుల్ మజీద్, ఆసిఫ్ అలీ, షారుక్ ఖాన్, రెహమాన్ ఉన్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా అరెస్టులతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


