News March 30, 2024

కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి: జడ్పీ చైర్మన్

image

బీఆర్ఎస్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాల పట్ల ములుగు జిల్లా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు ద్రోహులు మాత్రమే పార్టీ వీడుతున్నారని, దీంతో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

Similar News

News September 8, 2025

వరంగల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతుల స్వీకరణ

image

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతులను కలెక్టర్‌కు నేరుగా అందజేశారు. డాక్టర్ సత్య శారద ప్రతి వినతిని ఓర్పుతో స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 8, 2025

వరంగల్: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేతృత్వంలో ఈరోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పార్టీ సమన్వయం చేసి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

News September 8, 2025

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

image

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర నుంచి యధావిధిగా కార్మికులకే ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవికి CITU రాష్ట్ర కార్యదర్శి మాధవి ఈరోజు వినతి పత్రం అందజేశారు. మాధవి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, కార్మికులకు పని భద్రతను కల్పించాలని కోరారు.