News March 30, 2024

‘ఖమ్మం జిల్లాలో మతోన్మాదానికి చోటు లేదు’

image

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కలుషితమయ్యాయని, జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అన్నారు. ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదని తెలిపారు. జిల్లాలో కులమత తారతమ్యాలు లేకుండా జీవించే వాతావరణాన్ని కమ్యూనిస్టులు కల్పించారన్నారు. అటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ దిగుతోందని ఆయన విమర్శించారు.

Similar News

News March 22, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానాల్లో తగ్గుతున్న ప్రసవాలు!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై పర్యవేక్షణ లోపం గర్భిణులను ప్రైవేటు బాట పట్టిస్తోంది. గత ఏడాది సర్కారు ఆస్పత్రుల్లో కేవలం 6,316కాన్పులే జరగగా, ప్రైవేటులో ఆ సంఖ్య 7,789కి చేరడం గమనార్హం. వీటిలో అధిక శాతం సిజేరియన్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పేదలకు వైద్యభారం తప్పడం లేదు.

News March 21, 2026

నేరాల నియంత్రణే లక్ష్యం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు.

News March 21, 2026

మధిర: 9 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం

image

మధిర నియోజకవర్గంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 5 మండలాల్లో 9 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో 800–1000 మంది విద్యార్థులు చదివేలా ప్రణాళిక రూపొందించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటవుతాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు బోధన అందించనున్నారు. విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రవాణా ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.