News May 7, 2025
జడ్చర్ల: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.
Similar News
News July 5, 2025
జడ్చర్ల: అనుమానదాస్పదంగా మెకానికల్ ఇంజినీర్ మృతి

ఓ మెకానికల్ ఇంజినీర్ అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట(M) కాకర్ణాల సమీపంలోని ఓ మినరల్స్ కంపెనీలో కృష్ణా జిల్లా మంటాడకి చెందిన కాశి పూర్ణచందర్‌రావు(43) పనిచేస్తున్నారు. ఈనెల 2న విధులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన గురువారం శవమై కనిపించాడు. తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News July 5, 2025
మహబూబ్‌నగర్‌లో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడే వక్ర బుద్ధితో ఆలోచించాడు.. ఉన్నతమైన స్థానంలో ఉండి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. MBNR శివారులోని ధర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ రామ్మోహన్ కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేశారు.
News July 5, 2025
MBNR: సైబర్ నెరగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

పేదలను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. నకిలీ యాప్‌లు, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రం హోం తదితర ఫేక్ లింక్, యువతులపై ఆన్లైన్‌లో వేధింపులు, ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని, 1930 లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.