News May 7, 2025

జడ్చర్ల: మళ్లీ KCR పాలన రావాలి: మాజీ మంత్రి 

image

జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. సంక్షేమ పాలన రావాలంటే ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అంటున్నారని తెలిపారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, వార్డు అధ్యక్షుడు అల్మాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

image

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.

News March 15, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

News March 15, 2026

కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

image

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.