News May 7, 2025
ఎన్టీఆర్: ‘గృహ విద్యుత్ వినియోగదారులకు ముఖ్య సూచన’

గృహ విద్యుత్ వినియోగదారులు అదనపు విద్యుత్ లోడును క్రమబద్ధీకరించుకోవచ్చని APCPDCL స్పష్టం చేసింది. 50% రాయితీతో ఈ అవకాశం కల్పిస్తున్నామని విజయవాడలోని APCPDCL కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 30నలోపు సమీప విద్యుత్ శాఖ కార్యాలయం/మీ సేవా కేంద్రంలో/ APCPDCL అధికారిక వెబ్‌సైట్‌లో నిర్ణీత ఛార్జీలు చెల్లించి విద్యుత్ లోడును క్రమబద్ధీకరించుకోవచ్చని పేర్కొంది.
Similar News
News March 27, 2026
GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News March 27, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం నుంచి శుక్రవారం బయలుదేరాల్సిన 20830 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ అయింది. అనుసంధాన రైలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2:50 గంటలకు బదులుగా, సాయంత్రం 4:40 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
News March 27, 2026
నైవేద్యంగా వడపప్పు, పానకం.. ఎందుకంటే?

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం నైవేద్యంగా ఇవ్వడం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుండటంతో ఈ బెల్లంతో చేసిన పానకం ‘ఎనర్జీ డ్రింక్’లా పనిచేస్తుంది. నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. రాముడికి ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని శ్రీరామనవమి నాడు సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.


