News May 7, 2025

ప్రియదర్శిని జూరాల.. బహుళార్థక సాధక ప్రాజెక్టు

image

ఉమ్మడి పాలమూరులో కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా జూరాల ప్రాజెక్ట్ నిలిచింది. ఇదీ 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. దీనికింద1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు సాగునీరు అందిస్తోంది. ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.

Similar News

News March 28, 2026

కృష్ణా: పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతం

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం బయోలాజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 148 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 21,716 మంది విద్యార్థులకు గాను 21,408 మంది హాజరయ్యారన్నారు. 308 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 98.18% నమోదైందన్నారు. డీఈవోగా తాను 4 కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 32 కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.

News March 28, 2026

ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం: ప్రజా సమస్యలపై చర్చ

image

పాడేరు: ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. ఈ కీలక భేటీకి అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్, హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. స్థానిక ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వారు బదులిస్తూ, ముగ్గురు అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారాలు చూపుతామని స్పష్టం చేశారు.

News March 28, 2026

మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

image

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.