News May 7, 2025
నాగర్ కర్నూల్‌లో వ్యాక్సిన్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్సీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్‌లో హజ్ యాత్రికుల కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ క్యాంపును శనివారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హజ్ యాత్రికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 22, 2026
ఏలూరు జిల్లా MLA ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం!

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు మాయం చేసిన ఘటనపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేకు జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లాండ్ బ్యాంకులో ఖాతా ఉంది. సదరు ఖాతాకు ఫోన్ నెంబర్ లింక్ అవ్వనట్లు RTA చలానా పేరుతో యాప్ లింక్ రాగా ఎమ్మెల్యే దానిని ఓపెన్ చేశారు. దీంతో అకౌంట్లో ఉన్న రూ.12 లక్షలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 22, 2026
కొబ్బరి రేట్లు ఢమాల్

AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ఈ జాబితాలో కొబ్బరి కూడా చేరింది. నెల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ₹22K నుంచి ₹12K-13Kకు పడిపోయింది. రాష్ట్రంలో 2.7L ఎకరాల్లో కొబ్బరి సాగువుతుంది. ఇతర రాష్ట్రాల కొబ్బరిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం వల్ల ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో ఆ కొబ్బరిని దేశీయంగా వినియోగిస్తున్నారు. దీంతో మన కొబ్బరికి గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
News March 22, 2026
కృష్ణా: ‘బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి’

IPL మొదలుకానున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు అంటున్నారు. గతంలో బయటపడిన ప్రధాన బుకీల నెట్‌వర్క్‌లో పెడనకు చెందిన వారి పేర్లు ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల గన్నవరంలో బెట్టింగ్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలైన ఘటన మరువకముందే, మరో సీజన్ ప్రారంభం కానుండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.


