News May 7, 2025
ADB: ‘భూభారతి చట్టంతో రైతులకు మేలు’

జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా భూభారతి చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. దీంతో రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. DCCB ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, RDO వినోద్ కుమార్, MRO శ్రీనివాస్ తదితరులున్నారు.
Similar News
News March 21, 2026
ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోగా నేరుగా ఇంటికే డెలివరీ చేయబడతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో సరఫరా వ్యవస్థ సజావుగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
News March 21, 2026
ఆదిలాబాద్: జనగణన పారదర్శకంగా జరగాలి – కలెక్టర్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన (సెన్సస్-2027) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీలో టెక్నికల్ అసిస్టెంట్లు, క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఎక్కడా తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.