News May 7, 2025

దుర్భేద్యమైన చెపాక్ కోట.. బీటలు వారింది!

image

CSKకి ఒకప్పుడు చెపాక్ స్టేడియం దుర్భేద్యమైన కోటలా ఉండేది. అక్కడికి వెళ్లి ఆ జట్టును కొట్టాలంటే దాదాపు అసాధ్యమేనని ఇతర జట్లు భావించేవి. కానీ ఈ సీజన్‌లో ఆ కోట బీటలు వారింది. ఆ స్టేడియంలో వరసగా 4 మ్యాచులు ఓడటమే కాక 17 ఏళ్లలో తొలిసారి RCB చేతిలో, 15 ఏళ్లలో తొలిసారి ఢిల్లీ చేతిలో, 12 ఏళ్లలో తొలిసారి SRH చేతిలో చెన్నై ఓడిపోయింది. ఇక చెపాక్‌లో అత్యంత తక్కువ స్కోరును KKRపై నమోదు చేసింది.

Similar News

News March 18, 2026

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 18, 2026

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. వేల సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు

image

AP: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అడవుల్లో వందలాది కి.మీ నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తుండటం విశేషం. వీరంతా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న మొక్కులు తీర్చుకుంటున్నారు. 3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి.

News March 18, 2026

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. టెహ్రాన్‌పై అర్ధరాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ఇరాన్‌పై దాడులను ఉద్ధృతం చేశామని పేర్కొన్నారు. కాగా వరుసగా టాప్ లీడర్లు మరణిస్తున్నా తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.