News March 30, 2024
మళ్లీ హైజాక్.. రంగంలోకి భారత నేవీ
అరేబియా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. ఇరాన్‌కు చెందిన బోటుపై దాడి చేసిన 9మంది సాయుధ సముద్రపు దొంగలు, దాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యెమెన్‌కు సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న భారత నేవీ అరేబియా సముద్రంలో రంగంలోకి దిగింది. ఆపరేషన్ కొనసాగుతోందని, నౌకను రక్షిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News November 6, 2024
అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి
AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
News November 6, 2024
నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యం: మంత్రి రవీంద్ర
AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరీక్షలు చేస్తామని తెలిపారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు 13 ప్రామాణిక పరీక్షలు ఉంటాయన్నారు.
News November 6, 2024
సిరీస్ ఆస్ట్రేలియాదే: పాంటింగ్
టీమ్ ఇండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదా రిషభ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారని తెలిపారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ అత్యధిక వికెట్లు తీస్తారని అంచనా వేశారు.