News May 7, 2025
వాటికన్ సిటీలోనూ ట్రంప్, జెలెన్‌స్కీ చర్చలు

పోప్ ఫ్రాన్సిస్ అంతిమ సంస్కారాలు వాటికన్ సిటీలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన US అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ పోప్ పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత వారు అక్కడే చర్చలు జరిపినట్లు ఓ ఫొటో SMలో వైరలవుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే అంశంపై వీరిద్దరు పలుమార్లు భేటీ అయ్యారు.
Similar News
News August 13, 2025
చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.
News August 13, 2025
సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

AP: వైసీపీ నేత, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారని యర్రగుంట్ల పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నిడిజువ్విలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు యర్రగుంట్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు.
News August 13, 2025
NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్‌మెంట్ లెటర్‌ను MCC వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <