News May 7, 2025

ఇక సెలవు.. ముగిసిన పోప్ అంత్యక్రియలు

image

రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 21న ఆయన కన్నుమూయగా ఇవాళ వాటికన్ సిటీలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సుమారు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, US, ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు ట్రంప్, మేక్రాన్, జెలెన్‌స్కీ, బ్రిటన్ ప్రిన్స్ విలియం వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు.

Similar News

News January 11, 2026

₹1లక్ష జీతంతో 764 జాబ్స్.. ఇవాళే చివరి తేదీ

image

DRDO 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నిషియన్-A పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ఈ అర్ధరాత్రితో (11 JAN-26) ముగుస్తోంది. A పోస్టులకు SSC+ITI, కేటగిరీ Bకి BSc లేదా 3సం. డిప్లొమా విద్యార్హత. నెలకు ₹1లక్ష వరకు వేతనంతో పాటు HRA, TA, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 18-28సం. మధ్య వయస్కులు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం DRDO అధికారిక సైట్ చూడండి.
Share It

News January 11, 2026

PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

image

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌‌లో PSLV-C62 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.

News January 11, 2026

పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.