News May 7, 2025
BRS సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది: KTR

TG: రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్ వరంగల్ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Similar News
News August 13, 2025
పులివెందుల: కొనసాగుతున్న రీపోలింగ్

AP: పులివెందులలో ZPTC ఉప ఎన్నిక రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చవెల్లిలోని 3వ, కొత్తపల్లెలోని 14వ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు మరోసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిన్న పలు ఉద్రిక్త పరిస్థితులు జరిగిన నేపథ్యంలో ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అటు నిన్న సా.5గంటల వరకు పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
News August 13, 2025
అత్యవసరమైతేనే బయటకు రండి: హైడ్రా

TG: హైడ్రా పరిధిలో నేటినుంచి మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్, సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో వాహనాల వాడకం తగ్గించాలని, సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040 29560521, 9000113667, 9154170992.
News August 13, 2025
నేడు ED విచారణకు మంచు లక్ష్మి

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.