News March 30, 2024
తులసి గింజలతో ఎన్ని ఉపయోగాలో!
ఆధ్యాత్మికపరంగానే కాక వైద్యపరంగానూ తులసి మొక్కకు చాలా ప్రాశస్త్యం ఉంది. ప్రధానంగా తులసి గింజల వలన చాలా ఉపయోగాలున్నాయట. ‘జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుదల, ఎసిడిటీ, గ్యాస్ నియంత్రణ వంటి ఫలితాలు ఉంటాయి. మలబద్ధకానికి సహజసిద్ధమైన ఔషధం తులసి గింజలు’ అంటున్నారు నిపుణులు.
Similar News
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!
కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.