News May 7, 2025
పాక్ నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. గత మూడు రోజుల్లో 450 మందికి పైగా ఇండియన్స్ వాఘా బార్డర్ క్రాస్ చేశారు. వీరిలో 23 మంది పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు సంబంధించిన బ్రాడ్‌కాస్ట్ కంపెనీలో పనిచేసే వారే కావడం గమనార్హం. మరోవైపు భారత్‌లో ఉన్న 200 మంది పాకిస్థానీయులు తమ దేశానికి వెళ్లిపోయారు.
Similar News
News August 13, 2025
వీధికుక్కల తరలింపు తీర్పుపై సుప్రీం పునరాలోచన!

ఢిల్లీలో వీధికుక్కల తరలింపు ఆదేశాలపై విమర్శలు వ్యక్తమవడంపై సుప్రీంకోర్టు పునరాలోచించనుంది. ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీలోని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పుపై సినీ, రాజకీయ, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
News August 13, 2025
DSC అభ్యర్థులకు BIG ALERT

AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల <<17374210>>విడుదలైన<<>> విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఇవాళ రాత్రి నుంచి <
News August 13, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

TG: గ్రూప్-2 అభ్యర్థుల సెకండ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC విడుదల చేసింది. ఆగస్టు 20 నుంచి 23 వరకు అభ్యర్థులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయించుకోవాలంది. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్లు ఎంచుకోవాలని వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపికకారని TGPSC తెలిపింది. మరిన్ని వివరాలకు <