News May 7, 2025

ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. నిజమిదే!

image

ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాని సారాంశం. కాగా, అది 2017 నాటి వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమేదీ తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Similar News

News August 13, 2025

వీధికుక్కల తరలింపు తీర్పుపై సుప్రీం పునరాలోచన!

image

ఢిల్లీలో వీధికుక్కల తరలింపు ఆదేశాలపై విమర్శలు వ్యక్తమవడంపై సుప్రీంకోర్టు పునరాలోచించనుంది. ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీలోని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పుపై సినీ, రాజకీయ, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

News August 13, 2025

DSC అభ్యర్థులకు BIG ALERT

image

AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల <<17374210>>విడుదలైన<<>> విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఇవాళ రాత్రి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలుంటే సైట్‌లో సరిచూసుకోవడానికి రేపు రాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది.

News August 13, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

image

TG: గ్రూప్-2 అభ్యర్థుల సెకండ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC విడుదల చేసింది. ఆగస్టు 20 నుంచి 23 వరకు అభ్యర్థులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయించుకోవాలంది. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్లు ఎంచుకోవాలని వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపికకారని TGPSC తెలిపింది. మరిన్ని వివరాలకు <>వె‌బ్‌సైటును <<>>సంప్రదించండి.