News May 7, 2025

గుంటూరు జిల్లాలో భద్రతా తనిఖీలు 

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్‌, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 

Similar News

News September 10, 2025

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.

News September 10, 2025

నేడు ఉండ్రాళ్ళ తద్ది.. విశిష్టత తెలుసా

image

ఉండ్రాళ్ళ తద్ది నోమును భాద్రపద బహుళ తదియ రోజున స్త్రీలు ఆచరిస్తారు. దీని విశిష్టత ఏమంటే, ఈ నోమును పాటిస్తే పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులు సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఈ నోములో ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు, కాబట్టి దీనికి ఉండ్రాళ్ల తద్ది అనే పేరు వచ్చింది. ఐదు సంవత్సరాలు ఈ నోమును ఆచరించి, ఉద్యాపన చేసేటప్పుడు వాయనంతో పాటు చీర, రవికలను కూడా సమర్పిస్తారు. 

News September 10, 2025

ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

image

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.