News March 30, 2024

కోహ్లీ ఆటతీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు

image

నిన్న రాత్రి బెంగళూరులో జరిగిన RCB, KKR మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆయన విమర్శకులు విరుచుకుపడుతున్నారు. సుమారు 10 ఓవర్లు ఆడిన విరాట్, కేవలం 83 పరుగులే చేయడమేంటంటూ మండిపడుతున్నారు. దీంతో ‘140 స్ట్రైక్ రేట్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. 183 రన్స్ టార్గెట్‌ను 17వ ఓవర్లోనే కేకేఆర్ ఛేదించింది. తోటి ఆటగాళ్ల నుంచి సాయం లేకపోవడంతోనే విరాట్ అలా ఆడారంటూ ఫ్యాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

Similar News

News March 5, 2026

X-RAY లేని కాలంలో గర్భస్థ శిశువుపై శిల్పాలు!

image

కేరళంలోని త్రిశూర్‌లో ఉన్న వడుగనాథ స్వామి ఆలయం భారతీయ శిల్పకళా చాతుర్యానికి, అప్పటి శాస్త్ర విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఎక్స్-రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే గర్భంలోని శిశువు నెలవారీ ఎదుగుదల భంగిమలను కళ్లకు కట్టినట్లు చెక్కారు. నిజంగా మన పూర్వీకులకు గర్భస్థ శిశువుపై ఉన్న పరిజ్ఞానం ఎంత గొప్పదో కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News March 5, 2026

తిరుమల కొండపై దివ్వెల మాధురి అత్యుత్సాహం

image

AP: తిరుమలలో దివ్వెల మాధురి మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను ఆమె కొండపై ఓ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించారు. అయితే తిరుమలకు కేక్ తీసుకెళ్లడం నిషిద్ధం. ఈ ఘటనపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. గతంలోనూ MLC దువ్వాడ శ్రీనుతో కలిసి ఆమె తిరుమల ఆలయం ఎదుట రీల్స్ చేశారు. విమర్శలు రావడంతో ఇంకోసారి తప్పు చేయనంటూ క్షమాపణ చెప్పారు. తాజా ఉదంతంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

News March 5, 2026

బీజేపీకి ₹6,769 కోట్ల ఆదాయం

image

2024-25లో BJPకి ₹6,769 కోట్ల ఆదాయం వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ADR) తెలిపింది. 6 జాతీయ పార్టీలకు ₹7,960 కోట్లు రాగా, ఇందులో 85% బీజేపీకే వచ్చినట్లు చెప్పింది. కాంగ్రెస్‌కు ₹918 కోట్లు, CPMకు ₹172 కోట్లు, BSPకి ₹58.5 కోట్లు, AAPకు ₹39 కోట్లు వచ్చాయని వెల్లడించింది. తన ఆదాయంలో BJP ₹3,774 కోట్లు(55.76%), కాంగ్రెస్ 1,111.94 కోట్లు(అదనంగా ₹193.66cr) ఖర్చు చేసినట్లు చెప్పింది.