News March 30, 2024
చిత్తూరు: 6వ తేదీ వరకు గడువు పొడిగింపు

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 3, 2025
చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.
News November 3, 2025
చిత్తూరు: ఆధార్ అప్ డేట్ గడువు పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.


