News March 30, 2024

మే మొదటివారం రాష్ట్రానికి పీఎం మోదీ

image

TG: ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.

Similar News

News April 11, 2026

ఫోన్ పోయిందా? ‘సంచార్‌ సాథీ’తో తిరిగి పొందండి!

image

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ‘సంచార్‌ సాథీ’ వరంలా మారింది. ఈ <<15182220>>యాప్<<>> ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ వంటి రాష్ట్రాల్లో లక్షకు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టెలికం శాఖ తెలిపింది. Sanchar Saathi యాప్‌లో పోయిన ఫోన్‌ను సులభంగా బ్లాక్, ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ భద్రతను పెంచేందుకు, అపరిచిత సిమ్ కార్డులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

News April 11, 2026

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరం?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

News April 11, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ ఎందుకు కనిపించట్లేదంటే?

image

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి తీవ్రగాయాలయ్యాయని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాళ్లు డ్యామేజీ అయ్యాయని, ముఖానికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో ఆయన బయటకు రావట్లేదని, ఆడియో ద్వారా ఆర్మీకి, ఇతర నాయకులకు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్‌ఫైర్ అంశంలో అమెరికాతోనూ మాట్లాడినట్లు సమాచారం.