News May 8, 2025
అమెరికా జర్నలిస్టు మృతికి సిందూర్‌తో న్యాయం

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆపరేషనల్ హెడ్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం అంతర్జాతీయ సమాజ హితానికై చేసిన చర్యగా భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1999లో IC 814 హైజాక్ సూత్రధారి రౌఫ్ ఆ తర్వాత భారత్ సహా ప్రపంచంపై పలు దాడులకు తెగబడ్డాడు. Wall Street Journal (USA) జర్నలిస్టు డేనియల్ పర్ల్ కిడ్నాప్, హత్య ఇందులో ఒకటి. నాడు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందిన ఈ దారుణానికి సిందూర్‌తో నేడు న్యాయం జరిగిందని ఆర్మీ చెబుతోంది.
Similar News
News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
News November 19, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రౌడీ షీటర్లకు పాలకుర్తి సీఐ కౌన్సిలింగ్
> నవాబుపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కడియం
> కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జనగామ కలెక్టర్
> జనగామలో యువ వికసిత భారత్ 2k రన్
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
> మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో
> జనగామకు జల సంచాయ్ జన్ భగీరథి అవార్డు
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


