News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
జమ్మలమడుగులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

జమ్మలమడుగు-ముద్దునూరు రహదారిలోని పాటి వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. JMD (M) పెద్ద దండ్లూరు వాసి మాబు హుస్సేన్ (36), ప్రొద్దుటూరు (M) చౌడూరు వాసి ఖాదర్ బాషా (32) బైక్‌పై ముద్దనూరు నుంచి JMDకు వస్తుండగా అడ్డు వచ్చిన ఆవును తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న వరి కోత మెషీన్ వాహనాన్ని ఢీకొని చనిపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 1, 2026
గండికోటకు రానున్న అపర కుబేరుడు

ఇవాళ కడప జిల్లాకు అపర కుబేరుడు గౌతమ్ అదానీ రానున్నారు. ఇవాళ గండికోటలో, కొండాపురం, లింగాల మండలాల్లో అదానీ గ్రూప్ కంపెనీ చేపడుతున్న ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఈయన దాదాపు రూ.పది వేల కోట్లతో జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంతో వాటి పరిశీలనతో పాటు అదానీ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, కలెక్టర్‌తో చర్చిస్తారు.
News February 1, 2026
చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చెన్నూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లాక్‌అప్‌లను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.


