News May 8, 2025
డేటింగ్ వార్తలను కన్ఫర్మ్ చేసిన సమంత?

నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడిమూరుతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సమంత ఇన్‌స్టా పోస్ట్ ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తను నిర్మించిన ‘శుభం’ రేపు రిలీజవుతున్న నేపథ్యంలో రాజ్‌తో ఉన్న పిక్స్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు ‘లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం. న్యూ బిగినింగ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సమంత తన లవ్ రిలేషన్‌ను అఫీషియల్ చేశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
News February 5, 2026
YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్‌తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.


