News March 30, 2024

నేను గొర్రెను కాను: RSP

image

TG: ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను BRS పార్టీని వీడనని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ‘కడియం, కేకే వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో నేను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. బహుజనవాదం, తెలంగాణవాదం కలిసేందుకే నేను KCRతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.

Similar News

News April 3, 2026

శర్వానంద్ ‘బైకర్’ మూవీ రివ్యూ&రేటింగ్

image

తన కొడుకు మోటోక్రాస్ ఛాంపియన్‌ కావాలని కలల కనే తండ్రి(రాజశేఖర్), మధ్యలోనే రేసింగ్ ఆపేసే కొడుకు(శర్వానంద్) మధ్య జరిగే కథే బైకర్. శర్వా, రాజశేఖర్ నటనతో మెప్పించారు. బైక్ రైడింగ్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు ప్రాధాన్యం దక్కింది. కొన్ని డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ ఫర్వాలేదు. ఎమోషన్ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మైనస్.
రేటింగ్: 2.5/5

News April 3, 2026

ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

image

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.

News April 3, 2026

చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

image

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్‌ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.