News May 8, 2025
ఎల్జీ యూనిట్‌తో రూ.5,800 కోట్ల పెట్టుబడి: సీఎం

APలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని CM చంద్రబాబు చెప్పారు. తిరుపతి(D) శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. దీనిద్వారా 2,500కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ(SIPC) కింద ఈ ప్రాజెక్ట్ 100% ప్రోత్సాహకాలు పొందనుందని ట్వీట్ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఇదొక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.