News March 30, 2024

ప్రకాశం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

image

సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.

Similar News

News September 7, 2025

ప్రకాశం ప్రజలకు కలెక్టర్ ముఖ్య సూచన

image

ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అర్జీలను Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు.

News September 7, 2025

ప్రకాశంలో పలు ఆలయాలు మూసివేత..!

image

ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.

News September 7, 2025

ఒంగోలులో 5K రన్.. ప్రైజ్ మనీ ఎంతంటే.!

image

ఒంగోలులో ఈనెల 12న కలెక్టర్ కార్యాలయం నుంచి 5 కిలోమీటర్ల మారథాన్‌ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 17 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులు, అలాగే ట్రాన్స్‌జెండర్ విభాగాల్లో ఈ పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. పోటీలో ప్రథమ విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.7వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోగా 9493554212 నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.