News March 30, 2024
MNCL: హస్తం గూటికి మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు వస్తున్నా ఆయన నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆయన చర్చలు జరిపారు. కేకే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అరవిందరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడం ఖరారైంది.
Similar News
News March 16, 2026
ADB: బహిరంగంగా మద్యం తాగుతున్నారా? అయితే జైలుకే!

ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
News March 15, 2026
ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
News March 14, 2026
పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.


