News March 30, 2024
తాగునీటికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
TG: వేసవిలో నీటిఎద్దడి లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సీజన్‌లో తాగునీటి అవసరాలకు రూ.140 కోట్ల నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖకు రూ.40 కోట్లు, గ్రామపంచాయతీలకు రూ.100 కోట్లు కేటాయించింది. మరోవైపు నీటి సరఫరాపై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ విషయమై సీఎస్ శాంతికుమారి అధికారులతో రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 28, 2024
రేపు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
TG: సిద్దిపేట(D) కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు AP, TGలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.
News December 28, 2024
ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య
AP: వైఎస్సార్(D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 28, 2024
2024లో స్టార్లకు ‘సినిమా’ కష్టాలు
ఈ ఏడాది మూవీల హిట్లు, ఫట్లు పక్కనపెడితే పలువురు టాలీవుడ్ స్టార్లను ‘సినిమా’ కష్టాలు వెంటాడాయి. ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు, లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టు కలకలం రేపాయి. HYDలో Nకన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, మంచు ఫ్యామిలీలో వివాదం, RGVకి నోటీసులు, బన్నీ అరెస్టు చర్చనీయాంశమయ్యాయి.