News July 4, 2025

ములుగు జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ములుగు జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెల రోజుల(4 నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. పోలీసు అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బందులు చేపట్టొద్దన్నారు. వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News July 5, 2025

పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.

News July 5, 2025

రాజాపేట: డైనింగ్ హాల్‌ను చూసి భయమేసింది: జిల్లా అధికారి

image

రాజాపేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పప్పు కూరలో పోపు సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్‌ను చూసి భయమేసిందని, ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి సున్నం వేయాలన్నారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. చదువుకునేందుకు కొన్ని అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను కోరారు.

News July 5, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.