News July 4, 2025

వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ పడిపోయింది. గత 3 నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా గురువారం క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,390కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.175 తగ్గడంతో పత్తి రైతులు నిరాశ చెందుతున్నారు. కాగా, నేడు మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News July 4, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> హైకోర్టు న్యాయమూర్తిగా జనగామ జిల్లా వాసి
> జనగామ జిల్లా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా రాత్ కహనం
> రఘునాథపల్లి: శిథిలావస్థలో సర్దార్ సర్వాయి పాపన్న కోట
> జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి
> జిల్లా వ్యాప్తంగా కొనిదేటి రోశయ్య జయంతి వేడుకలు
> ఖర్గే సభకు అధిక సంఖ్యలో వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నేతలు
> దేవరుప్పులలో పర్యటించిన కలెక్టర్
> రూ.1.5 కోట్లతో బతుకమ్మకుంట అభివృద్ధి

News July 4, 2025

PHOTO: గోల్కొండ కోట అందం చూశారా?

image

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చాలా ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోటను ఎప్పుడైనా మీరు ఆకాశంలో నుంచి చూశారా? దీని ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కోట నిర్మాణం అబ్బురపరుస్తోంది. బోనాల సందర్భంగా ఈ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.

News July 4, 2025

ఒక్క మెరకముడిదాంలోనే 1100 మంది తగ్గిపోయారు: జడ్పీ ఛైర్మన్

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క మెరకముడిదాం మండలంలోనే 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని, జిల్లాలో చూస్తే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు.