News July 4, 2025
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించింది.
Similar News
News July 9, 2025
లార్డ్స్‌లో పరుగుల వరద కష్టమే?

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్‌లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, అట్కిన్‌సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.
News July 9, 2025
32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?
News July 9, 2025
రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.