News July 4, 2025

HYD: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్

image

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం ఆసపత్రిలో చేరారన్నారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం 1, 2రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

Similar News

News July 5, 2025

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

image

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్‌లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.

News July 5, 2025

ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్

image

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్‌గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్‌గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.

News July 5, 2025

ములుగు: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

image

ఈ నెల 7న కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే 7వ తేదీన జిల్లా కేంద్రంలో పదేళ్లు బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని, ఇద్దరి మృతికి కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.