News July 4, 2025

HYD: వేగంగా.. మెగా మాస్టర్ ప్లాన్-2050

image

HYD మెగా మాస్టర్ ప్లాన్-2050 వేగం పుంజుకుంటుందని HMDA అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన కామన్ మొబిలిటీ, ఎకనామికల్ డెవలప్మెంట్‌ బ్లూ, గ్రీన్ ఏరియా ప్లాన్ తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసేందుకు కన్సల్టెన్సీ ప్రపోజల్ రిక్వెస్ట్ కోసం HMDA ప్రకటన విడుదల చేసింది. ఈనెల 18వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ప్లాన్ అమలైతే HYD మరో స్థాయికి వెళ్లనుంది.

Similar News

News July 5, 2025

HYD: వీకెండ్ స్పెషల్.. నేచర్ క్యాంప్

image

HYD శివారు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో వీకెండ్ స్పెషల్ ఎంజాయ్ చేసేందుకు సువర్ణ అవకాశం. నేటి సా.5 నుంచి ఆదివారం ఉ.9:30 వరకు నేచర్ క్యాంపు ఉంటుంది. టీం బిల్డింగ్, పిచ్చింగ్, రాత్రిపూట అడవిలో వాకింగ్, నైట్ క్యాంపింగ్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రేక్కింగ్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ. మిగతా వారికి రూ.1,199 అని అధికారి రంజిత్ తెలిపారు. వివరాలకు 7382307476 నంబర్‌ను సంప్రదించండి.

News July 5, 2025

HYD: బోనాల జాతరకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

HYDలో ఆషాఢ బోనాల జాతర కొనసాగుతోంది. భక్తుల రద్దీని అదునుగా భావిస్తోన్న కొందరు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ జాతరలోనూ వీరు రెచ్చిపోయారు. 12 గంటల్లోనే 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 సెల్‌‌ఫోన్ దొంగతనాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లలో నిలబడినప్పుడు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
SHARE IT

News July 4, 2025

ట్యాంక్‌బండ్‌లో దూకిన మహిళ.. కాపాడిన యువకుడు

image

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్‌బండ్‌ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్‌బండ్ శివ కుమారుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.