News July 4, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
Similar News
News July 5, 2025
గుడ్‌న్యూస్.. సగానికి తగ్గనున్న టోల్ ఫీజ్!

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గే అవకాశముంది. 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను తాజాగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది. ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులకు మేలు జరగనుంది.
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
News July 5, 2025
కొత్తగా 157 సర్కారీ బడులు

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.