News July 4, 2025

రైల్వే లైన్, జాతీయ రహదారిపై కలెక్టర్ సమీక్ష

image

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్, నర్సాపురం బైపాస్ జాతీయ రహదారి ఏర్పాటుపై కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి ఇంతవరకు సేకరించిన రైల్వే లైన్ భూముల సరిహద్దులో ఫెన్సింగ్ లేదా స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే, జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులతో భూసేకరణలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై చర్చించారు. జేసీ నిశాంతి పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

సంగారెడ్డి: IIITకి 345 మంది ఎంపిక

image

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.

News July 5, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో 2022, 23, 24 బ్యాచ్‌లకు సంబంధించి బీఈడీ, స్పెషల్ బీఈడీ 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు AUG 26 నుంచి నిర్వహిస్తామని, పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 10 నుంచి 21లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ చూడాలని చెప్పింది.

News July 5, 2025

గుడ్‌న్యూస్.. సగానికి తగ్గనున్న టోల్ ఫీజ్!

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గే అవకాశముంది. 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను తాజాగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది. ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులకు మేలు జరగనుంది.