News July 4, 2025
సిరిసిల్ల రచయితకు దక్కిన అరుదైన గౌరవం

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత డా.పెద్దింటి అశోక్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘లాంగ్ మార్చ్’ నవలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో MA తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్‌లోకి చేర్చారు. ఆయన రచించిన మరో ప్రఖ్యాత నవల ‘జిగిరి’ను నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ సిలబస్‌గా బోధించనున్నారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె పాఠశాలలో పనిచేస్తున్నారు
Similar News
News July 5, 2025
టీబీ నివారణపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, విద్య సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేసి క్షయ వ్యాధి నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
News July 5, 2025
KMR: ఇన్‌ఛార్జ్ డీబీసీడీఓగా సయ్యద్ రఫీక్

కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇన్‌ఛార్జ్ బాధ్యతలను సయ్యద్ రఫీక్ శుక్రవారం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ డీబీసీడీఓగా పని చేసిన స్రవంతి ఆదిలాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.
News July 5, 2025
పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.