News July 4, 2025
గంభీరావుపేట్: ‘త్వరగా పూర్తిచేసుకుని సాయం పొందాలి’

ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం నుంచి సాయం పొందాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం గోరింటాలలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలలో లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని సూచించారు. డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహసిల్దార్ లు ఉన్నారు.
Similar News
News July 5, 2025
నిబంధనలను పాటించకుంటే చర్యలు: గీతాబాయి

చట్టపరిధిలో నియమ నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. గీతాబాయి హెచ్చరించారు. శుక్రవారం భీమవరంలో మెడ్ క్వెస్ట్ స్కానింగ్ సెంటర్‌ను గీతాబాయి తనిఖీ చేశారు. స్కాన్ సెంటర్లో పీసీ పీఎన్ డీటీ చట్టం పరిధిలో నిర్వహించాల్సిన నియమ నిబంధనలను పరిశీలించారు.
News July 5, 2025
హాయక చర్యలకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో రుతుపవనాలతో సంభవించే తుఫాన్లు, గోదావరి వరదలలో ప్రజలకు సమర్థవంతంగా సహాయక చర్యలను అందించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించిన సహాయక చర్యలపై ఆయన దిశా నిర్దేశం చేశారు.
News July 5, 2025
మోదుగుల గూడెంలో వర్షానికి కూలిన ఇల్లు

కురవి మండల పరిధి మోదుగుల గూడెంలో వర్షాల వల్ల రాసమల్ల యాదగిరి, సాలమ్మ దంపతుల ఇంటి పైకప్పు కూలింది. దీంతో దంపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి పెంకులు సాలమ్మ మీద పడటంతో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.