News July 4, 2025
నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి, లేదా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అడ్మిషన్లు జూన్ 12 నుంచి ఆగస్టు 12 వరకు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. SHARE IT
Similar News
News July 5, 2025
25 కుటుంబాలను దత్తత తీసుకున్న దగ్గుపాటి అశ్రిత

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె దగ్గుపాటి అశ్రిత పీ4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దగ్గుపాటి ఫౌండేషన్ తరఫున 25 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి సమావేశంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు. దగ్గుపాటి అశ్రితను అధికారులు, పీ4 టీం సభ్యులు అభినందించారు.
News July 5, 2025
సిద్దిపేట: IIITకి 345 మంది ఎంపిక

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.
News July 5, 2025
మెదక్: IIITకి 345 మంది ఎంపిక