News July 4, 2025
కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

KNR, జ్యోతినగర్‌లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్‌లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్‌లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.
Similar News
News July 5, 2025
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్‌లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్‌గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్‌గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.
News July 5, 2025
ములుగు: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

ఈ నెల 7న కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే 7వ తేదీన జిల్లా కేంద్రంలో పదేళ్లు బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని, ఇద్దరి మృతికి కారణం బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.